MovieGQ

Manchu Thaakina

Ela Cheppanu (2003) · Track 7 of 8

Song Details

Lyrics

మంచు తాకినా ఈ వనం పూలు తొడిగేనా ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా చిరునవ్వుల ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా కల జారిన ఈ కనుపాపలకి నలువైపుల నలుపేనా ఏమో మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా తుంచిన పూలను తెచ్చి అతికించలేను గాని చైత్రం నేనై వచ్చి నా తప్పు దిద్దుకోని చిగురాశలు రాలిన కొమ్మా చినబోకమ్మా పచ్చదనం నీలో ఇంకా మిగిలుందమ్మా అందామని ఉన్నా అవకాశం ఉందా నిందించలేని మౌనమే నన్నాపగా మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా నిన్నటి స్వప్నం కోసం వెనుదిరిగి చూడకంటూ రేపటి ఉదయం కోసం ముందడుగు వెయ్యమంటూ తెలవారని రేయని నడిపే వెలుగవగలనా... తడి ఆరని చెంపలు తుడిచే చెలిమవగలనా... నిదురించని నిజమై నిలదీసే గతమే భరించలేని భారమై వెంటాడగా... మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా చిరునవ్వుల ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా కల జారిన ఈ కనుపాపలకి నలువైపుల నలుపేనా ఏమో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ela Cheppanu

See All