Song Details
Lyrics
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా తరగని దూరములో...ఓ...ఓ... తెలియని దారులలో... ఓ... ఓ... ఎక్కడున్నావు అంటోంది ఆశగా ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇదీ... ఆ... ఆ... ఆ... ఆ... మళ్లీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా రెప్ప వేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్లీ మళ్లీ తలచుకుని ఆ... ఆ... ఆ... ఆ... ఇంకా ఎన్నో ఉన్నాయంటు ఇప్పుడే చెప్పాలంటు నిద్దరోను అంటోంది ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా తరగని దూరములో...ఓ...ఓ... తెలియని దారులలో... ఓ... ఓ... ఎక్కడున్నావు అంటోంది ఆశగా
Lyrics sourced from public databases. May contain errors.