MovieGQ

Aa Navvulo Emunnadho

Ela Cheppanu (2003) · Track 3 of 8

Song Details

Lyrics

ఆ నవ్వులో ఏమున్నదో చలించింది నా మనసు తొలిసారిగా ఆ కళ్ళతో ఏమన్నదో ఒకే చూపుతో నన్ను మంత్రించగా ఉదయంలా కనిపించింది హృదయంలో కొలువయ్యింది మెరుపల్లె నను తాకింది వరదల్లే నను ముంచిందీ... అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా... నచ్చజెప్పినా ఏ ఒకరు నమ్మరే ఎలా నన్నిపుడు నేనే నేనన్నా (2) మునుపు ఎన్నడూ ఇంతిదిగా మురిసిపోలేదుగా అదుపు తప్పేంత అలజడిగా ఊగిపోలేదుగా అడుగడుగు అలలవగా పరుగులు నేర్పింది తానే కదా... అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందిక గుర్తుపట్టనే లేదసలు గుండెలోతులో గుసగుసలు తానొచ్చేదాక (2) తెలియజెప్పింది తుంటరిగా వయసువచ్చిందని తలుపుతట్టింది సందడిగా నిదర ఎన్నాళ్ళని తన చెలిమే అడగమని తరుముకు వచ్చింది తుఫానుగా అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందిక... ఆ నవ్వులో ఏమున్నదో చలించింది నా మనసు తొలిసారిగా ఉదయంలా కనిపించింది హృదయంలో కొలువయ్యింది మెరుపల్లె నను తాకింది వరదల్లే నను ముంచిందీ... అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ela Cheppanu

See All