Song Details
Lyrics
మొదటి సారి నిన్ను చూస్తున్నా ఎంతకాలం గానో నువ్వు తెలిసున్నా పరవశములో మునిగిపోతున్నా ఎంత ప్రేమే నాలో దాచలేకున్నా ఓ అలేఖ్యా ఓ అలేఖ్యా ఇన్నాళ్ళు నాలో ఉన్నావో లేవో ఈ క్షణం ఎద నిండి పోయావే ఓ అలేఖ్యా ఓ అలేఖ్యా నా కళ్ళు నీవే నీ కళ్ళ నీళ్ళే ఈ క్షణం నీ కంట పడనీనే మొదటి సారి నిన్ను చూస్తున్నా ఎంతకాలం గానో నువ్వు తెలిసున్నా పరవశములో మునిగిపోతున్నా ఎంత ప్రేమే నాలో దాచలేకున్నా చరణం: 1 చిన్న సాయమే నేడిలా పెద్ద స్నేహమే ఊపిరే పోసుకిందిగ ప్రేమ లాగా ఆ చిన్న గొలుసుతో సంకెళ్ళ వేసినావుగ వెదురునే చూసినావుగా మురళి లాగ ఆ... ఓ అలేఖ్యా ఓ అలేఖ్యా నీ చిన్ననాటి చిన్నాని నేనే నా ధనం నీ చిన్ని నవ్వేనే ఓ అలేఖ్యా ఓ అలేఖ్యా ఆ చందమామ కధలోని జంటై జంటగ చిరకాలం ఉందామే మొదటి సారి నిన్ను చూస్తున్నా ఎంతకాలం గానో నువ్వు తెలిసున్నా పరవశములో మునిగిపోతున్నా ఎంత ప్రేమే నాలో దాచలేకున్నా చరణం: 2 నువ్వు ఉండగా ప్రతీ క్షణం నాకు అండగా ప్రేమికుల రోజు పండగ సంబరాలే హెయ్ హెయ్ నువ్వు జంటగ సెకండ్ లో సగము చాలుగా ఆ సుఖం దాటుతుంది అంబరాలే హెయ్ హెయ్ ఓ అలేఖ్యా ఓ అలేఖ్యా దూరాలు కరిగే తీరాలు మనకే ప్రేమలో విరహాలు చెరిపెయ్యవే ఓ అలేఖ్యా ఓ అలేఖ్యా ఈ జన్మ చాలె నీతోనే లానే కాలమే కడతేరి పోనీవే మొదటి సారి నిన్ను చూస్తున్నా ఎంతకాలం గానో నువ్వు తెలిసున్నా పరవశములో మునిగిపోతున్నా ఎంత ప్రేమే నాలో దాచలేకున్నా
Lyrics sourced from public databases. May contain errors.