Song Details
Lyrics
ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు సంకెళ్ళతో బంధించకు ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు తనలో నీ స్వరం వినరో ఈ క్షణం అనుకుందేదీ నీలోనే నువు దాచకు నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా కనిపించాక మౌనాన్నే చూపించకు ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు చరణం: 1 మేఘాల ఒళ్ళోనే ఎదిగిందనీ జాబిల్లి చల్లేనా జడివాననీ ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామనీ నీకు పూరేకులే గుచ్చుకోవే మరీ తీరమే ఓరినా తీరులో మారునా మారదూ ఆ ప్రాణం ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు చరణం: 2 వెళ్ళెళ్ళు చెప్పేసై ఏమవ్వదూ లోలోన దాగుంటే ప్రేమవ్వదూ అమృతం పంచడం నేరమే అవదురా హాయినే పొందడం భారమే అవదురా హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ఇప్పుడే ఆ అందం ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు సంకెళ్ళతో బంధించకు ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు తనలో నీ స్వరం వినరో ఈ క్షణం అనుకుందేదీ నీలోనే నువు దాచకు నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా కనిపించాక మౌనాన్నే చూపించకు
Lyrics sourced from public databases. May contain errors.