Chilakamma Chitikeyanga
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- అరె చిలకమ్మా చిటికేయంటా నువు రాగాలే పాడాలంటా
ఇక సాగాలి మేళాలంటా ఈ సరదాలే రేగాలంటా
ఓ చిన్నోడా పందిర వేయరా ఓ రోజూపూవు మాలే తేరా
ఈ చినదాని మెడలో వేయరా నడిరేయంతా సందడిచేయరా
ఆ టక్కరిగాడే అహ ఈ బుల్లోడే నను కట్టివేసే మొనగాడే లేడే
చరణం: 1
చీకుచింత లేదు చిందులేసే ఊరు పాటా ఆటా ఇది ఏందంటా
అహ ఊరి లోనివారు ఒక్కటైనారు నీకు నాకు వరసేనంటా
పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే కలలూరేనే
వాడనిదంట ఈ వేడుకే అందరికింకా వెత తీరేనే
అహ ఈ పూట కానీరా ఆటా పాటా
బుల్లెమ్మా నవ్విందంటా మణిముత్యాలే రాలేనంటా
అరె మామయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట
నీ మాటే నాకు ఓ వెండి కోట
నువు నాదేనంటా నీతోనే ఉంటా
చరణం: 2
వేడుకైన వేళ వెన్నెలమ్మలాగ దీపం నీవై వెలగాలంట
అహ చీకటంతా పోయే పట్టపగలాయే ఏలా దీపం ఇక మనకంట
జాతికి నేడే మంచికాలమే నమ్మకముంటే వచ్చి తీరేనే
ఊరికి నీవే మేలుకోరితే కోరికలన్నీ రేపే తీరేనే
అరె ఆనందం నీ సొంతం అంతేకాదా
చిట్టెమ్మా నన్నే చూడు జత చేరమ్మా నాతో పాడు
మురిపాల పండగపూట మన ముచ్చట్లే సాగాలంట
అహ నువు సై అంటే నీ తోడై ఉంటా
నీ కళ్లల్లోన నే కాపురముంటా
Dalapathi
Movie More SongsChilakamma Chitikeyanga Keyword Tags
-
-