Devuda Devuda
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- అరె అరె అరె అరె అరె...
దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
ఓయ్ దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువు కొంచెం సానపెట్టరా...
రిపీటు...
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువు కొంచెం సానపెట్టరా...
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే... ఓ ఓ ఓ...
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ...
దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
చరణం: 1
ఆరె ఆరే ఆరె ఆరే... అరెరే ఆరే అరెరే ఆరే
ఆలోచించు కొంచెం రైతుబిడ్డ కష్టం
అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం
వాడలోని మలినం శుభ్రం చేసేవారు
నాలుగు రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు
మాసిన జుట్టు పనీ పట్టె వాడంటూ లేకుంటే
తగ్గుతుందా తల బరువూ
నీళ్లలోనే నిలిచి ఉతికే వాడంటూ లేకుంటే
నిలుచునా మన పరువూ
ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు
దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారోయ్...
రిపీటు...
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే... ఓ ఓ ఓ...
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ...
ఆ... దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
చరణం: 2
నీ గురించి ఎవరో అరె ఏమనుకుంటే ఏమి
ఈ చెవితోటి విన్నాగాని ఆ చెవిలోంచి వదిలేయ్
మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా
ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పి
పూలబంతి పట్టి నీటి మధ్యలో ఉంచినా
తేలుతుందోయ్ పైకి సోదరా
అరె నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా
తేలిరారా పూలబంతిలా
మిణుగురు పురుగులు ఎన్నెన్నున్నా
పున్నమినాటి జాబిలి చల్లే పండు వెన్నెలనాపగలదా...
రిపీటు...
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే.... ఓ ఓ ఓ...
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ...
దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
స్వామి నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువు కొంచెం సానపెట్టరా...
రిపీటు...
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువు కొంచెం సానపెట్టరా...
శభాషు....
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే... ఓ ఓ ఓ...
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ...
- అరె అరె అరె అరె అరె...
Chandramukhi
Movie More SongsDevuda Devuda Keyword Tags
-
-
-