Song Details
Lyrics
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ నా చూపు నీ నవ్వనీ నా ఓపిరే నువ్వనీ నీకు చెప్పాలని నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు నమ్మనని నవ్వుకొని చాల్లె పొమ్మంటావు నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ నీ కంటి మైమరపులో నను పోల్చుకుంటాననీ తల ఆన్చి నీ గుండెపై నా పేరు వింటాననీ నీకు చెప్పాలని నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ నిను కలుసుకున్న ఆ క్షణం నను వదలిపోదనీ ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ నీకు చెప్పాలనీ
Lyrics sourced from public databases. May contain errors.