Song Details
Lyrics
పిల్లలు: అబ్బ అదిరింది ! అమ్మో భలే చేస్తున్నావే..హి హి హీ ! నా పేరు చక్రం.. భూచక్రం .. విష్ణుచక్రం .. సుదర్శన చక్రం బస్సు చక్రం .. కారు చక్రం .. సైకిల్ చక్రం .. కాల చక్రం ! జరిగింది.. జరుగుతున్నది..జరగబోయేది.. అన్నీ నాకు తెలుసు ! పిల్లలు: టూ మచ్ గా మాట్లాడకు.. అసలు నీకేం తెలుసోయ్ ? నీ అస్సలు పేరు బన్నీ..నీ అస్సలు పేరు చిన్నీ నీ పప్పీ పేరు స్నూపీ..నీ పాకెట్లో వన్ రూపీ పిల్లలు: Wow..great ! నీ కిష్టం Tom & Jerry నచ్చిన ఫ్రూటేమో చెర్రీ నీ పళ్ళకుంది క్లిప్పూ నువ్ పెట్టలేదు జిప్పూ పిల్లలు: ఇంకేం తెలుసూ ? చాలా తెలుసు ! నువ్ రాత్రి పూట పక్క మొత్తం తడిపేస్తుంటావు నీ ఫ్రెండుగాడి పెన్సిళ్ళన్నీ మాయం చేస్తావు నువ్వు సోఫా సెట్టు చెంచా తోటి కోసేస్తుంటావు నువు కడుపులో నొప్పని స్కూలుకి డుమ్మా కొట్టేస్తుంటావు పిల్లలు: ఇవన్నీ ఎట్టా చెప్పావూ.. ఇవన్నీ ఎట్టా చెప్పావూ? ఇదంతా ఫేస్ రీడింగూ.. ఇదంతా ఫేస్ రీడింగూ ముందుకు దువ్విన పండూ..హిందీలో మార్కులు రెండూ వెనక్కి దువ్విన వేణూ..నిను తన్నినవాడు సీను..సీనూ పిల్లలు : My God ! ఇదంతా క్రాఫ్ రీడింగూ.. ఇదంతా క్రాఫ్ రీడింగూ ! పిల్లలు : ఓ ! స్పైడర్ మాన్ విక్కీ..పడలేదా సైకిల్ ఎక్కీ సూపర్ మాన్ బాలూ..నైటంతా నోట్లో వేలూ ఇదంతా డ్రెస్సు రీడింగూ.. ఇదంతా డ్రెస్సు రీడింగూ ఫేస్ రీడింగ్ ..క్రాఫ్ రీడింగ్ .. డ్రెస్ రీడింగ్ అయిపోయాయ్ ! పిల్లలు: హమ్మయ్య ! ఇప్పుడు ఫ్యూచర్ రీడింగ్ ! నువ్ భవిష్యత్తులో..హే..చిరంజీవిలా.. నువ్ భవిష్యత్తులో చిరంజీవిలా డాన్సులు చేస్తావూ..బోలెడు ఫాన్సులు పొందేవూ పిల్లలు : Is it? Sure ! నువ్ భారత్ జట్టులో సచిన్ ప్లేస్ ని భర్తీ చేస్తావూ.. బిలియన్ పరుగులు తీస్తావూ పిల్లలు: We want sixer ! We want sixer ! నువ్వేమో air force..నువ్వేమో military force నువ్వేమో చోటా టాటా .. నువ్వేమో బుల్లి గేట్స్ పద్మశ్రీలు..డాక్టరేట్లు..జ్ఞానపీఠలు..భారతరత్నలు.. మీరే ! పిల్లలు: సరే మేమేం చెయ్యాలీ.. సరే మేమేం చెయ్యాలీ ? అల్లరి చెయ్యాలి..చిల్లర పనులే చెయ్యొద్దూ నవ్వుతూ ఉండాలీ..నవ్వుల పాలే కావొద్దూ కలలే చూడాలీ..నిజముగ మలచక వదలొద్దూ ఎత్తుకు ఎదగాలీ..నిలిచిన నేలను మరవొద్దూ భారతభూమిని మరవద్దూ.. భారతమాతను మరవద్దూ పిల్లలు : We like your idea..We love our India ! We like your idea..We love our India !!
Lyrics sourced from public databases. May contain errors.