MovieGQ

Musi Musi Navuulalona

Brahma (1992) · Track 3 of 5

Song Details

Singer
Music Director

Lyrics

ఆ... ఆ... ఆ... ఆ... ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగే వాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన ఆరేళ్ళ పాప కోసం ఆనాడు పాడినా అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడినా అభిమానమున్న వాన్ని అవమానపరచినా ఎదలోని చీకటంతా వెన్నెలగ మార్చినా బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన అనురాగ జీవితాన పెనుగాలి రేగినా తనవారు కానరాక కనుపాప ఏడ్చినా కడగళ్ళ బ్రతుకులోన వడగళ్ళు రాల్చినా సుడిగుండమైన నావ ఏ దరికి చేర్చినా బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగే వాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Brahma

See All