Song Details
Lyrics
హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక చీర దులిపేసే చూపులకు జోహారు సిగ్గు చిదిమేసే కోరికలే నా జోరు ఒహో హోహో హోహో హోహోహో (2) హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక లలల లాలా లాలా లలలా (2) చరణం: 1 ఎక్కడిదో ఈ వయసు చెలీ దక్కెనులే నీ దినుసు తొక్కిడిలో నా సొగసు యమా ఉస్కులడి నా మనసు మంచాలలో మల్లె కంచాలలో వండి వార్చాను వయ్యారి నా తళుకులు చెక్కిళ్ళలో వాటి పక్కిళ్ళలో దిద్దుకున్నాను ముద్దులతో నా తెలుగులు గుట్టు రైక ముడి పట్టు కదా నా పరువు అది ఫట్టుమనే బీటు కదా నా దరువు ఒహో హోహో హోహో హోహోహో (2) హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక చరణం: 2 ఒత్తిడిలో ఒక్క క్షణం చిత్తడిలో అగ్ని కణం అందుకనే ఆడతనం ముద్దులకే మూలధనం ఈడన్నది పుంజు కోడైనది దాని కొక్కొరొకో నీకొరకేలే తెలుసుకో తోడన్నది కొత్త జోడైనది దాని జోరు మరి ఆగదులే ఈ వయసులో కన్నె గువ్వ చెలి దువ్వి మరీ పోగొడతా ఉన్న కోడె గిలి తవ్వి మరి రాబడతా ఒహో హోహో హోహో హోహోహో (2) హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా నా సొత్తు యావత్తు నీదింక హే సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక చీర దులిపేసే చూపులకు జోహారు సిగ్గు చిదిమేసే కోరికలే నా జోరు ఒహో హోహో హోహో హోహోహో (2) లలల లాలా లాలా లలలా (2)
Lyrics sourced from public databases. May contain errors.