MovieGQ

Chemma Chekka Chemma Chekka

Azaad (2000) · Track 3 of 6

Lyrics

పల్లవి: చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క (2) చెమ్మ చెక్క చెమ్మ చెక్క (2) చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్ చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్ కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్ సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్ సరదాల సంగీతంతో చెలరేగింది సన్నాయి బరువైన సంతోషంతో తలవంచింది అమ్మాయి పెళ్ళి సందళ్ళలో చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్ చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్ కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్ సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్ చరణం: 1 ఊరు వాడ వచ్చి ఈడు జోడు మెచ్చి సంబరంగ చూస్తారంట కన్న వారు వచ్చి కన్నె దానమిచ్చి కంటనీరు పెడతారంట తడి కళ్ళే ప్రమిధలుగా వెలిగే పందిరిలోన పరవళ్ళే అందెలుగా ఆడే అనందాన పిట్ట కూత పంచె కట్టుకుంది మంత్రాలు వల్లిస్తూ హేయ్ పిల్ల గాలి పెళ్లి పెద్దయ్యింది పన్నీరు చల్లిస్తూ పెళ్లి సందళ్ళలో చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్ చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్ కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్ సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్ చరణం: 2 పట్టు చీర కట్టి పూల జడ చుట్టి కొత్త కళ మురిసే వేళ వాన విల్లు వంటి జాణ వన్నెలంటి వెయ్యి కళ్ళు మెరిసే వేళ నిలువెల్లా విరిసింది పులకింతల పూదోట విరిముళ్ళే విసిరింది పురి విప్పిన సయ్యాట ఆడ జన్మ మేలుకుంది చూడు సరికొత్త రూపంతో ఓయ్ అంగరంగ వైభవంగ నేడు జరిపించు వేడుకతో పెళ్లి సందళ్ళలో చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్ చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్ కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్ సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్ సరదాల సంగీతంతో చెలరేగింది సన్నాయి బరువైన సంతోషంతో తలవంచింది అమ్మాయి పెళ్ళి సందళ్ళలో చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్ చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్ కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్ సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్ చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్ కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్ సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Azaad

See All