MovieGQ

Nalo Nenu Lene

Avunu Valliddaru Ista Paddaru (2002) · Track 7 of 11

Lyrics

హే...లాలా హే...లాలా లాలా లల లలలా లాలా లల లలలా లాలా లల లలలా లాలా లల లలలా నాలో నేను లేనే లేను ఎపుడో నేను నువ్వయ్యాను అడగక ముందే అందిన వరమా అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా మొన్నా నిన్నా తెలియదె అసలూ మొన్నా నిన్నా తెలియదె అసలూ మదిలోన మొదలైన ఈ గుసగుసలూ ఏం తోచనీకుంది తియ్యని దిగులూ రమ్మని పిలిచే కోయిల స్వరమా కమ్మని కలలే కోరిన వరమా ఎందాక సాగాలి ఈ పయనాలూ ఏ చోట ఆగాలి నా పాదాలూ నాలో నేను లేనే లేను ఎపుడో నేను నువ్వయ్యాను అడగక ముందే అందిన వరమా అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా ఎన్నో విన్నా జంటల కథలూ ఎన్నో విన్నా జంటల కథలూ నను తాకనే లేదు ఆ మధురిమలూ కదలించనే లేదు అలలూ కలలూ గత జన్మలో తీరని ఋణమా నా జంటగా చేరిన ప్రేమా నా ప్రాణమే నిన్ను పిలిచిందేమో నా శ్వాసతో నిన్ను పెంచిందేమో నాలో నేను లేనే లేను ఎపుడో నేను నువ్వయ్యాను అడగక ముందే అందిన వరమా అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Avunu Valliddaru Ista Paddaru

See All