MovieGQ

Aaradugula Bullettu

Atharintiki Dharedhi (2013) · Track 1 of 6

Song Details

Lyrics

గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం భైరవుడొ భార్గవుడొ భాస్కరుడొ మరి రక్కసుడొ ఉక్కు తీగలాంటి ఒంటి నైజం వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం రక్షకుడొ దక్షకుడొ పరీక్షలకె సుశిక్షితుడో శత్రువు అంటు లేని వింత యుద్ధం వీడి గుండె లోతు గాయమైన శబ్ధం నడిచొచ్చె నర్తన శౌరీ పరిగెత్తె పరాక్రమ శైలీ హలాహలం ధరించిన ధగ్ ధగ్ హృదయుడొ వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం దివి నుంచి భువి పైకి భగ భగ మని కురిసేటి వినిపించని కిరణం చప్పుడు వీడు వడివడిగా వడగళ్లై ధడ ధడమని జారేటి కనిపించని జడి వానేగ వీడూ శంఖంలొ దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు శోకాన్నె దాచేసే అశోకుడు వీడురొ వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు తన దిశనే మార్చుకొని ప్రభవించె సూర్యుడికి తన తూరుపు పరిచయమె చేస్తాడూ రావణుడొ రాఘవుడొ మనసును దోచె మాధవుడో సైనికుడొ శ్రామికుడొ అసాధ్యుడు వీడురో వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Atharintiki Dharedhi

See All