Amma Devudo
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Karthik
Lyrics
- పల్లవి:
అమ్మదేవుడో అనిపించావే అయ్యో బ్రహ్మయ్యా
ఏమో నీదయ నాపై లేదయా
ఓరి దేవుడో యెదలో రేగే ఇదేంగోలయ్యో ఈ కధ ఏందయ్యా తెలిసేదెట్టయా
మదిలో ఏదో గొట్టే గొట్టే
గుండెల్లో సునామి పుట్టే
ఏడుకొండల వెంకటేశ్వరా నువ్వు నాకు దిక్కు
ఏదునాళ్ళుగా కోడి సాక్షిగా ఎంగిలడితే ఒట్టు
వెండి కొండల పార్వతీశ్వరా దండమెట్టు పట్టు
నిండు సాక్షిగా రెండు కన్నుల నిద్దరోతే ఒట్టు
చరణం: 1
ప్రపంచ వింతలు ఏడున్నా మరొక్కటి ఇక్కడ చూస్తున్నా
ప్రతొక్క చెలిమాటే వినిపించేలే
జగాన ఎందరు గనులున్నా జనాలు మెచ్చే
పొగరున్నా మగాడు మాత్రం నా ప్రియుడే అనిపించేనే
ఒక నవ్వే అది చాలు తన చిరునవ్వే అది పదివేలు
తగువే అనిపించే ఇక తనతోటే సరదాలు
ఏడుకొండలు వెంకటేశ్వరా పొద్దు పోకవుందిక
ఎంతమందిలో కలిసి ఉండినా నాకు తోచకుంది
వెండి కొండల పార్వతీశ్వరా దండమెట్ట పట్టు
నిండు సాక్షిగా రెండుకన్నులా నిద్దరోతె ఒట్టు
చరణం: 2
వయ్యారమంతా నాలోన వసంతమాడే తరుణాన
వరించి నే నే పెళ్ళాడే వరుడతడేలే
గతాల జన్మలు ఏవైనా మరింక జన్మలు ఎన్నున్నా
యుగాలు నాకు తోడుండే సఖి తానేలే
నా జంటై తానుంటే చలి మంటేగా చనువరులు
ముద్దై మురిపిస్తే బదులిస్తాగా మగసిరులు
వెండి కొండల పార్వతీశ్వరా దండమెట్టు పట్టు
నిండు సాక్షిగా రెండు కన్నులా నిద్దరోతె ఒట్టు
జమ్మి కొండల జంబుకేశ్వరా యెదను హత్తుకుంది
అందువల్ల తన చెంతకే మనస్సు పరుగులెడుతు ఉంది
Athanokkade
Movie More SongsAmma Devudo Keyword Tags
-
-


