Song Details
Lyrics
పల్లవి: అతనొక్కడేలే అందర్లోను ఈ జీవితమంటే ఓ కోరికరేపే అతనొక్కడేలే అతనొక్కడేలే ఎవ్వరికైనా ఓదార్పును చూపే ఓ దారిని చూపే అతనొక్కడేలే అతనొక్కడేలే అతనికి తోడు ఆనందంలోను బాధే అయిననూ అతనొక్కడేలే అందర్లోను తానొలడై కూడా ఉన్ననూ..... చరణం: 1 ఈ లోకమంతా మనలో ఉంది మనకోసం ఉంది మనతోడై ఉంది నీడనంది మదికోరుకుంది ఇస్తానంది నవ్విస్తానంది కవ్విస్తానంది నేస్తమంది మనమొంటరైతే వెంటే ఉంది మనజంటే అంది ప్రాణం లాంటిది మన బాధ అంతా నాదేనంటూ నేనున్నానంటు అన్నది చరణం: 2 ఓ చిన్ని ఆశతో సాగావంటే కేకేసావంటే ఆకాశంకూడా అదిరిపోదా నీ చిన్ని గుండెలో దాచావంటె భూగోళంకూడా భూపాలంతోటి నిదురపోదా ఏం చెయ్యాలన్నా నీలో ఉంది అడుగేసావంటే అడ్డేఉన్నదా నీఅంత నువ్వే వద్దన్నావో నీవద్దే అంతా చెరదా
Lyrics sourced from public databases. May contain errors.