MovieGQ

Andhamaina Vennelalona

Assembly Rowdy (1991) · Track 1 of 5

Lyrics

పల్లవి : అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాలా రాగాలె ఊగాల శివరంజ నవ్వాల గరిసదస గరిసదసగరిసదస చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా కనుల నిండా కలలు పండ పూలపడవ నడపాలి అందాలె చిందాలి అపరంజి నవ్వాలి గరిసదస గరిసదస గరిసదస అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా చరణం: 1 నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా ఒంపుసొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా ఒంపుసొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా కొమ్మమీద కోకిలనై కొత్తరాగం పలకాలా గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాలా కంటి పాపనై కాలి అందెనై కంటి పాపనై కాలి అందెనై కాలమంతా కరగబోసి కాపు ఉండనా సరీగ రిగాప గపాద పదాస గరిసదస గరిసదస గరిసదస చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా చరణం: 2 ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా సందెచుక్క నిలిచింది బుగ్గచుక్క పెట్టాలా ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా సందెచుక్క నిలిచింది బుగ్గచుక్క పెట్టాలా ఈడుజోడు ఎలుగెత్తి ఏరువాక పాడాలా తోడునీడ ఇరువురమై గూటికందం తేవాలా తీగమల్లినై తేనెజల్లునై తీగమల్లినై తేనెజల్లునై కోరికంత కూడబెట్టి కొలువుసేయనా సరీగ రిగాప గపాద పదాస గరిసదస గరిసదస గరిసదస అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా కనుల నిండా కలలు పండ పూలపడవ నడపాలి అందాలె చిందాలి అపరంజి నవ్వాలి గరిసదస గరిసదస గరిసదస

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Assembly Rowdy

See All