MovieGQ

Thaali Kattu Subhavela

Anthuleni Katha (1976) · Track 4 of 5

Song Details

Lyrics

తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఓ హో హో ఆ హా హా ఉహూఁ హూఁ ఏ హే హే తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో అహా హా ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల వికటకవి నేను వినండి ఒక కథ చెబుతాను కాకులు దూరని కారడవి అందులో కాలం ఎరుగని మానొకటి ఆ అందాల మానులో ఆ అద్భుత వనంలో చక్కని చిలకలు అక్కాచెల్లెలు పక్కన గోరింకలు ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మా బావా రావా నన్నేలుకోవా తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో మేళాలు తాళాలు మంగళవాద్యాలు మిన్నంటి మోగెనమ్మా మేళాలు తాళాలు మంగళవాద్యాలు మిన్నంటి మోగెనమ్మా వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా Singapore airlines announces the arrival of flight S2583 ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఓ హో హో ఆ హా హా ఉహూఁ హూఁ ఏ హే హే తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో అహా హా ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల గోమాత లేగతో కొండంత ప్రేమతో దీవించ వచ్చెనమ్మా కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్స్ చెప్పిరమ్మా Wish you both a happy life... happy happy married life నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్లు వర్థిల్లమనెనమ్మా తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల చేయి చేయిగ చిలుక గోరింక శయ్యకు తరలిరమ్మా చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగ తలచెనమ్మా తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Anthuleni Katha

See All