Song Details
Lyrics
కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు చరణం: 1 నీటిలో ఆరే నిప్పును కానూ నిప్పున కాగే నీరైన కానూ ఏదీ కానీ నాలో రగిలే ఏదీ కానీ నాలో రగిలే ఈ అనలాన్నీ ఆర్పేదెవరో నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు చరణం: 2 తానే మంటై వెలుగిచ్చు దీపం చెప్పదు తనలో చెలరేగు తాపం నే వెళ్లు దారి ఓ ముళ్లదారి నే వెళ్లు దారి ఓ ముళ్లదారి రాలేరు ఎవరూ నాతో చేరి నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు చరణం: 3 వేసవిలోనూ వానలు రావా కోవెల శిలకు జీవం రాదా జరిగేనాడే జరుగును అన్నీ జరిగేనాడే జరుగును అన్నీ జరిగిననాడే తెలియును కొన్నీ నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు
Lyrics sourced from public databases. May contain errors.