MovieGQ

Devude Ichadu Veedhi Okati

Anthuleni Katha (1976) · Track 1 of 5

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత ఇల్లేలా ఇక ఊరేల సొంత ఇల్లేలా ఓ చెల్లెలా... ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం నన్నడిగి తలిదండ్రి కన్నారా... నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా పాపం పుణ్యం నాదికాదే పోవే పిచ్చమ్మా నారుపోసి నీరుపోసే నాధుడువాడమ్మా ఏది నీది ఏది నాది ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా... ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి శిలలేని గుడికేల నైవేద్యం ఈ కలలోని సిరికేల ఈ సంబరం ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మా కళ్ళులేని కబోది చేతి దీపం నీవమ్మా తొలుత ఇల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా... ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం మన్నులోన మణిక్యాన్ని వెదికే వెర్రమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా... ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Anthuleni Katha

See All