Gulabi Puvvai Navvali Vayasu
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- పల్లవి:
గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగె మనము ఉండాలిలే
మనసు దోచి మాయజేసీ
చెలినే మరచిపోవొద్దోయి రాజా... రాజా
గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
చరణం: 1
వసంతరాణి నీకోసమే ఖుషిగ వచ్చింది
చలాకినవ్వు చిందించుచు హుషారు తెచ్చింది
మయూరిలాగా నీ ముందర నాట్యం చేసేను
వయ్యారిలాగా నీ గుండెలో కాపురముంటాను
వలపుపెంచి మమతపంచి
విడిచిపోనని మాటివ్వాలి రాజా... రాజా
గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
చరణం: 2
మరీ మరీ నీ అందానికీ సలాము చేసేను
పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను
యుగాలకైనా నాదానివై నీవే వుంటావు
అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను
మనసు నీదే మమత నీదే..
రేయి పగలు నాలో వున్నది నీవే.. సోనీ
గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగె మనము ఉండాలిలే
లాలలా లాలలా లాలలా లాలలా
Annadammula Anubandham
Movie More SongsGulabi Puvvai Navvali Vayasu Keyword Tags
-
-