Aanati Hrudayala Ananda Geetham 2
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- పల్లవి:
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆ పాట అధరాలపైన పలికేను ఏనాటికైనా...
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే... ఇదేలే
చరణం: 1
ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి
ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి
వెలుతురైనా చీకటైనా విడిపోదు... ఈ అనుబంధం
చరణం: 2
తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి
తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి
ఆటలాగా.. పాటలాగా... సాగాలి మన జీవితం
Annadammula Anubandham
Movie More SongsAanati Hrudayala Ananda Geetham 2 Keyword Tags
-
-