MovieGQ

Kanulu Therachina

Anandam (2001) · Track 2 of 7

Song Details

Lyrics

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మవేలా ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా ఇన్నాళ్ళూ నేనున్నది నడిరేయి నిదురలోన అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మవేలా ఓ ఓ... ఓ ఓ... ఓ ఓ... (2) చరణం: 1 పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది నీ జతలో ఈ సంతోషం పంచాలని పిస్తోంది ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది అయితే నేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది దూరం మహ చెడ్డదని లోకం అనుకుంటుంది కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది నీలో నాప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలె నా ఊపిరైనవని కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా చరణం: 2 ప్రతినిముషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోందీ నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే నేనే ఇక లేనట్టు నీలో కరిగించావో ప్రేమా ఈ కొత్త స్వరం అనుమానం కలిగించి నువ్వే నా సందేహానికి వెచ్చనైన ఋజువియ్యమంది మరి కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా ఇన్నాళ్ళూ నేనున్నది నడిరేయి నిదురలోన అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Anandam

See All