Song Details
Lyrics
ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా చలిచెర అసలెప్పుడు వదిలిందో ఆణువణువూ మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందో చూస్తూనే ఎక్కడి నుంచో చైత్రం కదిలొస్తుంది పొగమంచును పోపొమ్మంటూ తరిమేస్తుంది నేలంతా రంగులు తొడిగి సరికొత్తగా తోస్తుంది తన రూపం తానే చూసి పులకిస్తుంది ఋతువెప్పుడు మారిందో బ్రతుకెప్పుడు విరిసిందో మనసెప్పుడు వలపుల వనమైందో ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా చలిచెర అసలెప్పుడు వదిలిందో ఆణువణువూ మురిసేలా చిగురాశలు మెరిసేలా తోలి శకునం ఎప్పుడు ఎదురైందో
Lyrics sourced from public databases. May contain errors.