MovieGQ

Premalekha Raasene Ilaa Pedaalu

Anaganaga O Dheerudu (2011) · Track 2 of 7

Lyrics

పల్లవి: చిరుగాలై వచ్చేదెవరో చెలి చెంప గిచ్చేదెవరో చిరకాలం నిలిచేదెవరో ఎవరో వారెవరో అలలాగ వచ్చేదెవరో అరచేయి పట్టేదెవరో అనురాగం పంచేదెవరో ఎవరో వారెవరో ఎవరంటే నీ వెంట నేనేలే నేనంటే నిలువెల్లా నీవేలే నీవంటే తనువెల్లా ప్రేమేలే ప్రేమించే వేళయిందో... చరణం: 1 ప్రేమలేఖ రాసెనే ఇలా పెదాలు ప్రేమరేఖ దాటెనే ఇలా పదాలు ప్రేమకిక వేసెనే ఇలా ప్రాయాలు ఏం మాయ ఏం చేస్తుందో ప్రేమలేఖ రాసెనే ఇలా పెదాలు ప్రేమలాలి కోరెనే ఇలా క్షణాలు ప్రేమలోతు చేరెనే పది ప్రాణాలు ఈ హాయి ఎటుపోతుందో చరణం : 2 నవ్వావంటే నువ్వు ఆ నవ్వే గువ్వై తారాజువ్వై నాలో ఏఁమాయెనో రువ్వావంటే చూపు ఆ చూపే చేపై సిగ్గై చెరువై లోలో ఏఁమాయెనో ముసినవ్వుకు మనసే లేత మొగ్గ వేసునో కొనచూపుకు వయసే రేకు విచ్చునో పసిరేకుల సొగసే నేడు పూత పూసెనో ఆ పూవు ప్రేమైందో ఏమో...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Anaganaga O Dheerudu

See All