MovieGQ

Chandamamala Andagaadini

Anaganaga O Dheerudu (2011) · Track 4 of 7

Song Details

Lyrics

చందమామలా అందగాడిని చుక్కలెందరో నా వెనకే చుక్కలెందరో చుట్టిముట్టినా చెలి కొరకే నా పరుగే చరణం: 1 పెదవులు పగడ కాంతులు పలుకులు చెరుకు బంతులు నడకలు నెమలి గంతులు గలగలగలలు కనులలో కోటి రంగులు నడుములో మర ఫిరంగులు కురులలో జలధి పొంగులు జలజలజలలు తన కొరకే కలవరమై తన వరకే చెలి స్వరమై తన దరికే నా ప్రాణమే ప్రయాణమై చరణం : 2 జిగిబిగి మనసు సంకెల తెగువగ తెంచా నేనిలా మగువను మార్చా ప్రేమలా తొలితొలితొలిగా పరిచిన పసిడి దారిలా విరిసిన వెలుగు ధారలా నడిచా ఆమె నీడలా కలకలకలగా తన వలపే అమృతము తన వరమే జీవితము తన పరమై తరించనీ ఈ సోయగము

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Anaganaga O Dheerudu

See All