Patala Pallaki
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- సామజ వరగమన సామజ వరగమున
సాధుహృద్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామజ వరగమన
పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన
నిరంతరం వసంతమే సంగీతం
పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన
నిరంతరం వసంతమే సంగీతం
గుప్పెడు గుండెలు లోన గుడి గంటలు సందడిలోన
ప్రతి క్షణం స్వరార్చనే సంగీతం
అల లాంటి జీవితాన నిజమైన హాయి రాగం
ఎన్నెల్లోన గోదారల్లే పొంగే సంగీతం
పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన
నిరంతరం వసంతమే సంగీతం
సెల్ ఫోన్
ఎంత దూరమైన చిరుగాలి పాటలోన
అనుబంధం పలికించే రాగం
సిగరెట్
గాలి అలల పైన ఆ నింగి తాకుతున్న
పొగమబ్బును కరిగించును రాగం
కళ్లు
కంటి పాప బాష సంగీతం
గాలి గుండె పాట సంగీతం పూల చెట్టు నీడ సంగీతం
అక్షరాల కందమైన రూపం
హృదయ లయల శృతులు కలుపు పెదవి సంతకం
పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన
నిరంతరం వసంతమే సంగీతం
మరి ప్రేమ
వాన విల్లులోన ఏ రంగు లేదు అయినా
ఎద రంగుల తొలి రంగే ప్రేమ
ఓ మరి బెస్ట్ ఫ్రెండ్
కంటి ఊసులోన ఈ ఒంటరీడు లోన
జత చేరిన ప్రియ నేస్తమే ప్రేమ
సిగ్గు
పాల బుగ్గ సిగ్గు ఈ ప్రేమ వాలు కళ్ళు ముగ్గు ఈ ప్రేమ
తేనె కన్నా మత్తు ఈ ప్రేమ పూల కన్నా మెత్తనీ ప్రేమ
తీపి జ్ఞాపకాల పేరే ప్రేమ
ఓ ఫన్టాస్టిక్
మనసు తలుపు తెరిచి పిలుపు చిలిపి సరిగమ
పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన
నిరంతరం వసంతమే సంగీతం
గుప్పెడు గుండెలు లోన గుడి గంటలు సందడిలోన
ప్రతి క్షణం స్వరార్చనే సంగీతం
అల లాంటి జీవితాన నిజమైన హాయి రాగం
ఎన్నెల్లోన గోదారల్లే పొంగే సంగీతం
పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన
నిరంతరం వసంతమే సంగీతం
సామజ వరగమున సామజ వరగమున
సాధుహృద్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామజ వరగమన
- సామజ వరగమన సామజ వరగమున
Ammayi Bagundi
Movie More SongsPatala Pallaki Keyword Tags
-
-
-