Song Details
Lyrics
పుట్టడిబొమ్మకు సెగలు చుట్టే ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే పన్నీటి స్నానాలు చేసే వేళలో నున్నని చంపకు సిగ్గులు పుట్టే అన్నుల మిన్నను అల్లరి పెట్టే కనరాని బాణాలు తాకే వేళలో చెయ్యత్తుచున్నాము శ్రీరంగ స్వామి చేయూత సాయంగ అందియ్య వేమి నా ప్రేమ సామ్రాజ్య దేవీ పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి నీ కన్యా ధనం కాపాడగా నాదేలే హామీ సరేనంటే రూపం తాపం సమర్పయామి నీ సందిటిలోని సమస్తము నీదే దయామి కునుకుండదు కన్నులలోన కుదురుండదు గుండెలలో ఆణువణువు కొరుకుతున్నది తియ్యని మైకం ఎదిగొచ్చిన వన్నెల వాన ఒదిగుండదు ఒంపులలో చెరనొదిలి ఉరుకుతున్నది వయసు వేగం మనసు పడే కానుక అందించనా ప్రేమికా దహించితే కోరిక సహించకే గోపిక అధిరేటి అధరాల ఆనా అందం చందం అన్నీ నీకే సమర్పయామి ఆనందం అంటే చూపిస్తాలే చెలి ఫాలో మీ పుట్టడిబొమ్మకు సెగలు చుట్టే ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే నున్నని చంపకు సిగ్గులు పుట్టే అన్నుల మిన్నను అల్లరి పెట్టే పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి నీ కన్యా ధనం కాపాడగా నాదేలే హామీ నులువెచ్చని పొద్దులలోన తొలి ముద్దులు పుచ్చుకొని సరిహద్దులు దాటవే ఒంటరి కిన్నెరసాని నును మెత్తని సోయగమంతా సరికొత్తగ విచ్చుకొని ఎదరొచ్చిన కాముని సేవకు అంకితమవని అవి ఇవి ఇమ్మని అదే పనిగ వేడని ఇహం పరం నువ్వని పదే పదే పాడని తెరచాటు వివరాలు అన్నీ దేహం దేహం తాకేవేళ సంతర్పయామి దేహం మోహం తీరే వేళ సంతోషయామి పుట్టడిబొమ్మకు సెగలు చుట్టే ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే పన్నీటి స్నానాలు చేసే వేళలో నున్నని చంపకు సిగ్గులు పుట్టే అన్నుల మిన్నను అల్లరి పెట్టే కనరాని బాణాలు తాకే వేళలో చెయ్యత్తుచున్నాము శ్రీరంగ స్వామి చేయూత సాయంగ అందియ్య వేమి నా ప్రేమ సామ్రాజ్య దేవీ పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి నీ కన్యా ధనం కాపాడగా నాదేలే హామీ
Lyrics sourced from public databases. May contain errors.