Repalle Malle
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- రేపల్లె మళ్ళీ మురళి విన్నది
కోరస్: తననా
మా పల్లె కలే పలుకుతున్నది
కోరస్: తననా
ఆ జానపదం జల్లుమన్నది
కోరస్: తననా
ఆ జానజతై అల్లుకున్నదీ
మొగలి పువ్వు మారాజుకి మొదటి కానుకా
ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదికా
మల్లె నవ్వు మారాని ఈ గొల్ల గోపికా
మూగ మనసు వింటున్నది మురళి గీతికా
కోరస్: తననా
రేపల్లె మళ్ళీ మురళి విన్నది
కోరస్: తననా
మా పల్లె కలే పలుకుతున్నది
కోరస్: తానన తందానన తజుం తజుం జుం
తానన తందానన తజుం తజుం తజుం తజుం
ఆ పెంకితనాల పచ్చిగాలి ఇదేనా
పొద్దుపోని ఆ ఈలలేనా ఈ ఆలాపన
ఆ కరుకు తనాల కన్నె మబ్బు ఇదేనా
ఇంతలోనే చిన్నారి చినుకై చెలిమే చిలికెనా
అల్లరులన్ని పిన్నలగ్రోవికి స్వరములిచ్చేనా
కళ్ళెర్రజేసే కిన్నెర సానికి సరళి నచ్చేనా
మెత్తదనం - కో: తందననా
మెచ్చుకొని గోపాల క్రిష్ణయ్య గారాలు చెల్లించనా
కోరస్: తననా
రేపల్లె మళ్ళీ మురళి విన్నది కోరస్: తననా
మా పల్లె కలే పలుకుతున్నది
మొగలి పువ్వు మారాజుకి మొదటి కానుకా
మూగ మనసు వింటున్నది మురళి గీతికా
కోరస్: ససని సరి సరి సరి పనిని సగ పని నిని నిని నిని
నీ గుండె వినేలా వెంట వెంట ఉండేలా
గొంతులోని రాగాలు పంపాను ఈ గాలితో
ఆ ప్రేమపదాల గాలిపాట స్వరాల
పోల్చుకొని కలిపేసుకున్నాను నా శ్వాసలో
ఎక్కడ ఉన్నా ఇక్కడ తిన్న వెన్నె వేణువయ్యే
కొంగును లాగి కొంటెదనాలే కంటికి వెలుగయే
వన్నెలలో - కో: తందననా
వెన్నెలలే వెచ్చని వెల్లువలయ్యే వరసిదీ
రేపల్లె మళ్ళీ మురళి విన్నది
మా పల్లె కలే పలుకుతున్నది
ఆ జానపదం జల్లుమన్నది
ఆ జానగతై అల్లుకున్నదీ
మొగలి పువ్వు మారాజుకి మొదటి కానుకా
ఎదను పరిచివేసెయ్యనా ప్రణయ వేదికా
మల్లె నవ్వు మారాని ఈ గొల్ల గోపికా
మూగ మనసు వింటున్నది మురళి గీతికా
లాలాల లలా లాల లాలలా
లాలాల లలా లాల లాలలా
Allari Mogudu
Movie More SongsRepalle Malle Keyword Tags
-
-