Song Details
Lyrics
పల్లవి: ముద్దిమ్మంది ఓ చామంతి మనసిమ్మంది ఓ పూబంతి చలి రాతిరిలో జత జాతరలో ఎటు పోను జాబిలి రహదారులన్నీ తారలైన వేళ ముద్దిమ్మంది ఓ చామంతి మనసిమ్మంది ఓ పూబంతి చలి రాతిరిలో జత జాతరలో ఎటు పోను జాబిలి రహదారులన్నీ తారలైన వేళ చరణం: 1 ముందరున్న ముద్దరాలి ముద్దు.. చెల్లిద్దు.. ఇటు చూద్దూ మండుతున్న మోహనాంగి మత్తు... కలిగిద్దు.. ఇటు రద్దు పెదవి పొడుపు కథ విప్పేద్దు... చెప్పేద్దు గుట్టు అదుపు పొదుపు ఇక చాల్లెద్దు... చంపేద్దు బెట్టు అనువైన అందుబాటు చూడమంది ముద్దిమ్మంది ఓ చామంతి మనసిమ్మంది ఓ పూబంతి చరణం: 2 వేడి వేడి ఈడు ఊదుకుంటూ చవి చూద్దూ... చెలి విందు వేడుకైన జోడు చూడమంటూ జరిపిద్దు... జడ కిందు నిదర నదిని కసుకందేలా కరిగిద్దు.. పొద్దు మదన పదవి మనకందేలా చెరిపేద్దు.. హద్దు సడిలేని సద్దుబాటు చేయమంది ముద్దిమ్మంది ఓ చామంతి మనసిమ్మంది ఓ పూబంతి చలి రాతిరిలో జత జాతరలో ఎటు పోను జాబిలి రహదారులన్నీ తారలైన వేళ ముద్దిమ్మంది ఓ చామంతి మనసిమ్మంది ఓ పూబంతి
Lyrics sourced from public databases. May contain errors.