Song Details
Lyrics
ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహొ బస్తీ దొరసాని ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది హాయ్ ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది హాయ్ ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది అందచందాల వన్నెలాడి అయినా బాగుంది ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహొ బస్తీ దొరసాని కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది హాయ్ కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది హాయ్ ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది అందచందాల వన్నెలాడి కోపం పోయింది ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహొ బస్తీ దొరసాని పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది హాయ్ పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది హాయ్ చివరకు చిలిపిగ నవ్వింది, చేయి చేయి కలిపింది అందచందాల వన్నెలాడి ఆడి పాడింది ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహొ బస్తీ దొరసాని ఓహొ బస్తీ దొరసాని ఓహొ బస్తీ దొరసాని
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Abhimanam
See AllMadhini Ninnu Neranammi
J.V. Raghavulu, Madhavapeddi Satyam
Thallini Minchi Dharuni
Jikki
Vooyalaloogi Na Hrudayam
P. Susheela, Ghantasala
Anandamanandame Antharangala
P. Susheela
Innallu Perigina Ee Illu
-
Valapu Thene Paata
Ghantasala, Jikki
Hecharika Raju Vedale Ravi Tejamu
Ghantasala, Nalla Ramamurthy
Kongu Lagedhavelara Konte Krishna
P. Susheela
Sundari Andhachandhala
Ghantasala
Rama Rama Idhiyemi Kanneeti Gaadha
S. Varalakshmi
Dhayagala Thalliki
P. Susheela