MovieGQ

Midisi Padaku

Aasthiparulu (1966) · Track 2 of 10

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా రా రా చరణం: 1 దోరవయసు అలవి కాని భారమయింది ఆ బరువు మోయలేక నడుము పలచబడింది దోరవయసు అలవి కాని భారమయింది ఆ బరువు మోయలేక నడుము పలచబడింది నడుములేని నడకే ఒక నాట్యమయింది నడుములేని నడకే ఒక నాట్యమయింది చూచి చూచి బావ మనసు సొమ్మసిల్లింది.. సొమ్మసిల్లింది! చరణం: 2 అత్తకూతురంటేనే హక్కు ఉందిలే అల్లరెంత చేసినా చెల్లుతుందిలే అత్తకూతురంటేనే హక్కు ఉందిలే అల్లరెంత చేసినా చెల్లుతుందిలే ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో ఇంత అత్త కూతురూ కొత్త పెళ్ళి కూతురే .. కొత్త పెళ్ళి కూతురే ! మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aasthiparulu

See All