MovieGQ

Oura Ammaka Chella

Aapadbandhavudu (1992) · Track 2 of 7

Lyrics

ఊఁ...ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల ఊఁ హు - ఉఁ తందనాననానన తందనాననానన తందనాననానన ఆఁ ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాధల్లో... అమ్మలాల పైడి కొమ్మలాల వీడు ఏమయ్యోడో జాడ లేడియ్యాల పోని తందనాలమ్మా వందనాలా గోవుల్లాల పిల్లంగ్రోవుల్లాల గొల్లభామల్లారా ఈడ మొగుడియ్యాల నారి నందనాలమ్మా ఆనందలీలా అమ్మలాల పైడి కొమ్మలాల వీడు ఏమయ్యోడో జాడ లేడియ్యాల పోని తందనాలమ్మా వందనాలా ఆ... ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీల అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికి అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికి బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా ఔరా అమ్మకచెల్లా ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల చరణం: 1 ఊఁ నల్లరాతి కండలతో కరుకైనవాడే ఊఁ వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆనందలాల వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనందలాల జాణ జాన పదాలతో జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీల చరణం: 2 ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనందలాల ఆలమందు కాళుడిలా అనిపించు కాదా ఆనందలీల వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల తులసి దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాధల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీల

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aapadbandhavudu

See All