MovieGQ

Chukkallara

Aapadbandhavudu (1992) · Track 5 of 7

Lyrics

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికీ వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ విన్నవించరా వెండి మింటికీ జో జో... లాలీ, జో జో... లాలీ జో జో... లాలీ, జో జో... లాలీ మలి సంధ్య వేళాయే చలి గాలి వేణువాయే మలి సంధ్య వేళాయే చలి గాలి వేణువాయే నిదురమ్మా ఎటు పోతివే మునిమాపు వేళాయే కను పాప నిన్ను కోరె కునుకమ్మా ఇటు చేరవే తన్న నన్న తాన నా తన్న నన్న తాన నా నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే గువ్వల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే జోల పాడవా బేల కళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ జో జో... లాలీ, జో జో... లాలీ పట్టుపరుపులేల పండువెన్నెలేల అమ్మ ఒడి చాలదా బజ్జోవే తల్లి పట్టుపరుపేలనే అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగా జో కొట్టునే నారదాదులేల నాధబ్రహ్మలేల అమ్మ లాలి చాలదా బజ్జోవే తల్లి నారదాదులేలనే నాధబ్రహ్మలేలనే అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే చిన్ని చిన్ని కన్నుల్లో ఎన్ని వేల వెన్నెల్లో తీయనైన కలలెన్నో ఊయలూగు వేళల్లో అమ్మలాల పైడి కొమ్మలాల వీడు ఏమయ్యోడీవైపు లేడియ్యాల కోటి తందనాల ఆనందలాల గోవుల్లాల పిల్లంగ్రోవుల్లాల గొల్లభామల్లారా యాడనుందియ్యల నాటి నందనాల ఆనందలీలా జాడ చెప్పారా చిట్టితల్లికి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి జో జో... జోలాలీ, జో జో... లాలీ చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aapadbandhavudu

See All