Song Details
Lyrics
ఆవేశమంతా ఆలాపనేలే ఎద లయలో ఆవేశమంతా ఆలాపనేలే ఎద లయలో ఉదయినిగా నాలొ జ్వలించె వర్ణాల రచన నాలొ జనించె స్వరాలా ఆవేశమంతా ఆలాపనేలే అల పైటలేసే సెలపాట విన్న గిరివీణ మీటే జలపాతమన్న నాలోన సాగే ఆలాపనా రాగాలు తీసె ఆలోచనా ఝరుల జతల నాట్యం అరవిరుల మరుల కావ్యం ఎగసి ఎగసి నాలొ గళ మధువులడిగె గానం నిదురలేచె నాలొ హృదయమే ఆవేశమంతా ఆలాపనేలే ఎద లయలో ఆవేశమంతా ఆలాపనేలే వన కన్యలాడే తొలి మాసమన్న గోధూళి తెరలో మలిసంజకన్న అందాలు కరిగే ఆవేదన నాదాల గుడిలో ఆరాధన చిలిపి చినుకు చందం పురివిడిన నెమలి పించం ఎదలు కలిపి నాలొ విరి పొదలు వెతికె మోహం బదులు లేని ఏదో పిలుపులా ఆవేశమంతా ఆలాపనేలే ఎద లయలో నాలొ జ్వలించె వర్ణాల రచన నాలొ జనించె స్వరాలా ఆవేశమంతా ఆలాపనేలే
Lyrics sourced from public databases. May contain errors.