Song Details
Lyrics
తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో అవే తీయనీ సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలూదగా సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై మల్లెపూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో అహ తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో వైశాఖం తరుముతుంటే నీ ఒళ్ళో ఒదుగుతున్నా ఆషాఢం ఉరుముతుంటే నీ మెరుపే చిదుముకున్నా కవ్వింతలో వాలి పువ్వంత కావాలి పండించుకోవాలి ఈ బంధమే నీతోడు కావాలి నే తోడుకోవాలి నీ నీడలో ఉన్న శృంగారమే జాబిల్లీ సూరీడూ ఆకాశంలో నిండిన సొగసుల తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో కార్తీకం అహ్.. కలిసి వస్తే నీ పరువం అడుగుతున్నా హేమంతం కరుగుతుంటే నీ అందం కడుగుతున్నా ఆకాశ దేశాన ఆ మేఘరాగాలు పలికాయి నా స్వప్నసంగీతమే ఈ చైత్రమాసాల చిరునవ్వు దీపాలు వెలిగాయి నీ కంట నాకోసమే గిలిగింతే గీతాలై సింగారానికి సిగ్గులు కలిపిన తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో అవే తీయనీ సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలూదగా సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో
Lyrics sourced from public databases. May contain errors.