MovieGQ

Abba Dheeni

Aakhari Poratam (1988) · Track 3 of 5 · 4:42

Lyrics

పల్లవి: అబ్బ దీని సోకు సంపంగి రేకు అంటుకుంటె షాకు నన్నంటుకోకు అమ్మ దీని చూపు మరుమల్లె తూపు అమ్మ రాకు రాకు నేనున్నవైపు లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే అబ్బ దీని సోకు సంపంగి రేకు అంటుకుంటె షాకు నన్నంటుకోకు అమ్మ దీని చూపు మరుమల్లె తూపు అమ్మ రాకు రాకు నేనున్నవైపు చరణం: 1 దోర అందాలు చూశాక నేను దోచుకోకుంటె ఆగేదెలా కొమ్మ వంగాక కొంగొత్త పండు దాచినా నేను దాగేదెలా సందెపొద్దింక సన్నగిల్లాక చిన్నగా గిల్లుకోనా చిమ్మచీకట్లే సిగ్గుపడ్డాక నిన్ను నేనల్లుకోనా ఒడ్డులేని ఏరు ఒడేల భామా అడ్డులేని ప్రేమా ఇదేనులే ముద్దుపెట్టగానె ముళ్ళుజారిపోయే వెల్లువంటి ఈడు మీద ఒళ్ళు ఒళ్ళు వంతెనేసి చాటు చూసి దాటుతుంటే తంటా అబ్బ దీని సోకు సంపంగి రేకు అంటుకుంటె షాకు నన్నంటుకోకు అమ్మ దీని చూపు మరుమల్లె తూపు అమ్మ రాకు రాకు నేనున్నవైపు లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే అబ్బ దీని సోకు సంపంగి రేకు అంటుకుంటె షాకు నన్నంటుకోకు చరణం: 2 ఎన్ని బాణాలు వేస్తావు నీవు తీపిగాయలతో చెప్పనా ఎన్ని కోణాలు ఉన్నాయినీలో కంటికే నోరు మూసెయ్యనా ఎంత తుళ్ళింత లేత ఒళ్ళంతా కౌగిలే కప్పుకోనా మెచ్చుకున్నంత ఇచ్చుకున్నంత మెత్తగా పుచ్చుకోనా తెడ్డులేని నావా చలాకి ప్రేమా సందు చూసి పాడే సరాగమే బొట్టు పెట్టగానే గట్టు జారిపోయే వెన్నెలంటి సోకులన్ని ఈలవేసి ఇవ్వబోతే ముందుగానె దోపిడైతె టాటా అబ్బ దీని సోకు సంపంగి రేకు అంటుకుంటె షాకు నన్నంటుకోకు అమ్మ దీని చూపు మరుమల్లె తూపు అమ్మ రాకు రాకు నేనున్నవైపు లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే అబ్బ దీని సోకు సంపంగి రేకు అంటుకుంటె షాకు నన్నంటుకోకు అమ్మ దీని చూపు మరుమల్లె తూపు అమ్మ రాకు రాకు నేనున్నవైపు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aakhari Poratam

See All