MovieGQ

Swathi Chinuku

Aakhari Poratam (1988) · Track 1 of 5 · 5:33

Lyrics

పల్లవి: స్వాతి చినుకు సందెవేళలో... హొయ్ లేలేత వణుకు అందగత్తెలో... హొయ్ మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే చలే కొరుకుతుంటే హొయ్ చెలే వదుకుతుంటే భలేగుంది పడుచు ముచ్చటా హా భలే కదా గాలి ఇచ్చటా భలేగుంది పడుచు ముచ్చటా... హా భలే కదా గాలి ఇచ్చటా... స్వాతి చినుకు సందెవేళలో... హొయ్ లేలేత వలపు అందగాడిలో... హొయ్ ఈడే ఉరుముతుంటే... నేడే తరుముతుంటే సరాగాలతోటే స్వరాలల్లుకుంటే పదా అంది పడుచు పూపొదా.. హొయ్ ఇదే కదా చిలిపి ఆపదా పదా అంది పడుచు పూపొదా..హోయ్.. ఇదే కదా చిలిపి ఆపదా చరణం: 1 ఈ గాలిలో ఒకే చలీ ఈ దెబ్బతో అదే బలి ఈ తేమలో ఒకే గిలీ ఈ పట్టుతో సరే సరి నీ తీగకే గాలాడక - నా వీణలే అల్లాడగా నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా వరాలిచ్చి పోరా వరించాను లేరా చల్లని జల్లుల సన్నని గిల్లుడు సాగిన వేళా.. కురిసిన స్వాతి చినుకు సందెవేళలో.. హొయ్ లేలేత వణుకు అందగత్తెలో.. హొయ్ మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే పదా అంది పడుచు పూపొదా... హొయ్ ఇదే కదా చిలిపి ఆపదా భలేగుంది పడుచు ముచ్చటా ...హా భలే కదా గాలి ఇచ్చటా చరణం: 2 యా యా యా యా యా యా.... ఈ వానలా కథేమిటో నా ఒంటిలో సొదెందుకో నీకంటిలో కసేమిటో నాకంటినీ తడెందుకో తొలివానలా గిలిగింతలో పెనవేసినా కవ్వింతలో ఎదే మాట రాకా పెదాలందు ఆడా శృతే మించిపోయి లయే రేగిపోగా మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళా మెరిసిన స్వాతి చినుకు సందెవేళలో హొయ్ లేలేత వలపు అందగాడిలో హొయ్ ఈడే ఉరుముతుంటే నేడే తరుముతుంటే చలే కొరుకుతుంటే హొయ్ చెలే వదుకుతుంటే భలేగుంది పడుచు ముచ్చటా హా భలే కదా గాలి ఇచ్చటా పదా అంది పడుచు పూపొదా హొయ్ ఇదే కదా చిలిపి ఆపదా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aakhari Poratam

See All