MovieGQ

Sapatu Yetu Ledu

Aakali Rajyam (1981) · Track 5 of 6

Song Details

Lyrics

హె హె హె హె హె హె హే హేహె రు రు రు రు రూ రు రూ రూరు సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్ స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్ స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్ మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ మన కీర్తి మంచు కొండరా మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ మన కీర్తి మంచు కొండరా డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకుని డిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము దేశాన్ని పాలించె భావి పౌరులం బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్ స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్ బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా ఈ పుణ్యభూమిలొ పుట్టడం మన తప్ప ఈ పుణ్యభూమిలొ పుట్టడం మన తప్ప ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా గంగలొ మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్ స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్ సంతాన మూలికలం సంసార బానిసలం సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా చదవెయ్య సీటు లేదు చదివొస్తె పనీ లేదు అన్నమో రామచంద్ర అంటె పెట్టె దిక్కేలేదు దేవుడిదె భారమని పెంపు చేయర బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలొ వీధి వీధి నీది నాదె బ్రదర్ స్వతంత్ర దేశంలొ చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aakali Rajyam

See All