MovieGQ

Gussa Rangaiah

Aakali Rajyam (1981) · Track 1 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

గుస్స రంగయ్య కొంచం తగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్య గుస్స రంగయ్య కొంచం తగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్య ఈ లోకం మారేది కాదు ఈ శోకాలు తీరేవి కావు ఈ లోకం మారేది కాదు ఈ శోకాలు తీరేవి కావు దోర పాకాన ఉన్నాను నేను కొత్త లోకాన్ని నాలోన చూడు గుస్స రంగయ్య కొంచం తగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్య దేశాన్ని దోచేటి ఆసాములున్నారూ దేవున్ని దిగమింగు పూజారులున్నారూ ప్రాణాలతొ ఆడు వ్యాపారులున్నారూ మనిషికి మంచికి సమాధి కట్టారు మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగలేదు మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగలేదు జాతి వైద్యులె కోత కోసిన నీతి బ్రతకలేదు భోగాలు వెతుకాడు వయసు అనురాగాల జతి పాడు మనసు నీ దాహానికనువైన సొగసు నీ సొంతాన్ని చేస్తుంది పడుచు గుస్స రంగయ్య కొంచం తగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్య కాటుకెట్టిన కళ్ళలొ కైపులున్నవీ మల్లెలెట్టిన కురులలొ మాపులున్నవీ వన్నె తేరిన కన్నెలొ చిన్నెలున్నవీ అన్ని నీవె అనుటకు ఋజువులున్నవి చక్కని చుక్క సరసనుండగ పక్క చూపులేలా చక్కని చుక్క సరసనుండగ పక్క చూపులేలా బాగుపడని ఈ లోకం కోసం బాధపడేదేలా మోహాన్ని రేపింది రేయి మన స్నేహంలొ ఉందోయి హాయి ఈ అందానికందివ్వు చేయి ఆనందాల బంధాలు వేయి గుస్స రంగయ్య కొంచం తగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్య

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aakali Rajyam

See All