MovieGQ

Punnaga Thotallo

Viyyalavari Kayyalu (1979) · Track 6 of 6

Lyrics

పల్లవి: పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ.. ఆ సన్నాయి పాటల్లో అమ్మాయి ఆడింది గోదారి వరదల్లే ఉయ్యాలలూగింది పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ.. చరణం: 1 దేవుడి మాట.. కోవెల గంట.. దీవెనగా పలికింది పండగ పూట పడుచుల పాట.. పల్లె పదంగా మిగిలింది అనురాగాలే విను రాగాలై.. మమతల వేణువు పిలిచింది పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ.. చరణం: 2 రెప రెపలాడే రెప్పలలోనే రేపటి పొద్దులు మెరవాలి నవనవలాడే నవ్వులలోనే వయసు వసంతలాడే కన్నెతనంలో వెన్నెల కెరటం నేడే ఈడై ఎగసింది పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ.. ఆ సన్నాయి పాటల్లో అమ్మాయి ఆడింది గోదారి వరదల్లే ఉయ్యాలలూగింది పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Viyyalavari Kayyalu

See All