Song Details
Lyrics
తందానే తందానే తందానే తందానే చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని తందానే తందానే తందానే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగానే ఏ తియ్యదనం మనసుపై రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే తందానే తందానే తందానే చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని తందానే తందానే తందానే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగానే ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే తందానే తందానే తందానే చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని తందానే తందానే తందానే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగానే ఈ ఇంట్లిలోన ఇరుకుండదే ప్రతి మనసులోన చోటుందిలే ఈ నడకకెపుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడి విడిగా వీళ్ళు పదాలే ఒకటయ్యిన వాక్యమల్లే ఒక తియ్యటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే తందానే తందానే తందానే చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని తందానే తందానే తందానే తందానే బంధాల గ్రంధాలయమే ఉందీ ఇంట్లోనే ఒకటే కలగంటాయంట వీళ్ళందరి కళ్ళు అద్దాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు
Lyrics sourced from public databases. May contain errors.