MovieGQ

Jeevithame Oka Payanam

Vijetha (1985) · Track 3 of 5

Song Details

Lyrics

పల్లవి: హే...హే హే హే హే... ఓ..లలలలాల... జీవితమే ఒక పయణం యవ్వనమే ఒక పవనం వేగం వలపు రాగం ఎంత మధురం పోదాం చేరుకుందాం ప్రేమ తీరం హే..హే... హే... జీవితమే ఒక పయణం చరణం: 1 లయలో నీ లయలో నీ వయ్యారమే చూడనా జతలో నీ జతలో నీ అందాలు వేటాడనా వడిలో నీ వడిలో పూల ఉయ్యాలలే ఊగనా వలపే నా గెలుపై ప్రేమ జండాలు ఎగరేయనా ఈ లోకమే... మన ఇల్లుగా పట్టాలే కలిపేసి చెట్టపట్టాలు పట్టెయ్యనా జీవితమే ఒక పయణం.. చరణం: 2 ఎగిరి పైకెగసి నే తారల్ని తడిమెయ్యనా తారా దృవతారా నీ తళుకుల్ని ముద్దాడనా రాణి మహరాణి నా పారాణి దిద్దేయ్యనా బోణీ విరిబోణి తొలిబోణీలు చేసేయ్యనా మేఘాలలో... ఊరేగుతూ మెరుపుల్లో చినుకుల్లో సిగ్గంత దోచేయ్యనా జీవితమే ఒక పయణం చరణం: 3 అలల ఊయలలా నిను ఉర్రుతలూగించనా తడిసే నీ ఎదలో నే తాపాలు పుట్టించనా మురిసే నవ్వులలో ఆణిముత్యాలు పండించనా మెరిసే కన్నులలో నీలి స్వప్నాలు సృష్టించనా కెరటాలకే ఎదురీదుతూ వెన్నెల్లా నావల్లో ఈ సంద్రాలు దాటెయ్యనా జీవితమే ఒక పయణం యవ్వనమే ఒక పవనం వేగం వలపు రాగం ఎంత మధురం పోదాం చేరుకుందాం ప్రేమ తీరం హే.. హే హే హే హే హే హే ఓ..లలలలలాలా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vijetha

See All