MovieGQ

Idi Oka Idi Oka

Vijayadasami (2007) · Track 5 of 6

Song Details

Lyrics

ఇది ఒక ఇది ఒక నవలోకం ఇద్దరి ప్రేమకు శ్రీకారం మనసులు కలిసిన ఈ సమయం ఆనందానికి తొలి ఉదయం వరమో వశమో ప్రేమే జగమో శుభమో సుఖమో మది సంబరమో ఇది ఒక ఇది ఒక నవలోకం ఇద్దరి ప్రేమకు శ్రీకారం మనసులు కలిసిన ఈ సమయం ఆనందానికి తొలి ఉదయం కలవై కలసి కథ మార్చావు మెరుపై మెరిసి నను తాకావు కుదురంటు లేకుంది మనసుకు నిదరంటు రాకుంది ఎందుకు అందర్నీ చూస్తున్నాను వింతగా చుక్కల్ని లెక్కేస్తున్నా కొత్తగా సరదాగా మొదలైన ఈ ప్రయాణం మొత్తంగా ప్రేమాయణం ఎటు చూస్తున్నా ఏదో లోకం అటు నీవుంటే తెగ సంతోషం ఇది ఒక ఇది ఒక నవలోకం ఇద్దరి ప్రేమకు శ్రీకారం మనసులు కలిసిన ఈ సమయం ఆనందానికి తొలి ఉదయం చంద్రుడు చేతికి అందెనా మబ్బులు మాటలు నేర్చెనా పువ్వులు పాటలు పాడెనా కొండలు నాట్యములాడెనా ఏ బ్రహ్మ సృష్టించాడో ప్రేమగానే జగమంత వింతగుంది నేడు ఎటు చూస్తున్నా అటు అద్బుతమే మాయలు చేసే మది సంబరమే ఇది ఒక ఇది ఒక నవలోకం ఇద్దరి ప్రేమకు శ్రీకారం మనసులు కలిసిన ఈ సమయం ఆనందానికి తొలి ఉదయం వరమో వశమో ప్రేమే జగమో శుభమో సుఖమో మది సంబరమో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vijayadasami

See All