MovieGQ

Nee Andam

Varasudochadu (1988) · Track 1 of 6

Lyrics

పల్లవి: నీ అందం నా ప్రేమ గీత గోవిందం నీ వర్ణం నా కీరవాణి సంకేతం నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం ఈ యోగం ఏ జీవధార సంయోగం వయ్యారి రూపం.. గాంధార శిల్పం.. శృంగార దీపం వెలిగిస్తే నీ చూపు కోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే నీ అందం నా ప్రేమ గీత గోవిందం ఈ యోగం ఏ జీవధార సంయోగం చరణం: 1 జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల పారాణి వేదాలు గమకించగా కోరాడు మీసాల తారాడు మోసాల నా మందహాసాలు చమకించగా ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో ఎదజంట తాళాలు వినిపించగా ఆషాడ మేఘాల ఆవేశ గీతాలు సరికొత్త బావాలు సవరించగా నీ కోసమే ఈడు నేను వేచాములే నీ కోసమే నాలో నన్నే దాచానులే నిను పిలిచాను మలిసంధ్య పేరంటం ఇక మొదలాయే పొదరింటి పోరాటం ఆరాటం నీ అందం నా ప్రేమ గీత గోవిందం ఈ యోగం ఏ జీవధార సంయోగం చరణం: 2 హంసల్లె వచ్చింది హింసల్లె గిచ్చింది నీ నవ్వు నా పువ్వు వికసించగా మాటల్లే వచ్చింది మనసేదో విప్పింది వద్దన్నా నీ మాట వలపించగా రెప్పల్లొ కొచ్చింది రేపల్లె కాళింది నా నువ్వు నీ నేను క్రీడించగా గాదల్లొ నిదరోయీ రాధమ్మ లేచింది నా వేణువె నాకు వినిపించగా నీ పించమే కిలకించితాలు చేసిందిలే నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే మన హృదయాలలో ప్రేమ తారంగం స్వరబృందా విహారాల కుందేటి ఆనందం నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం ఈ యోగం ఏ జీవధార సంయోగం వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే నీ చూపు కోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే నీ అందం నా ప్రేమ గీత గోవిందం ఈ యోగం ఏ జీవధార సంయోగం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Varasudochadu

See All