Priya Mahashaya
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- ప్రియా మహాశయా లయా చూపవేల దయా
చెలీ మనోహరి సఖి మాధురి హృదయా
స్వయంవరా - ప్రియం కదా
మాటేరాని మౌనం హాయిలో
ప్రియా మహాశయా లయా చూపవేల దయా
చెలీ మనోహరి సఖి మాధురి హృదయా
తొలి తొలి బులబాటమేదో పులకరిస్తుంటే
అదే కదా కధ
ముఖా ముఖి మొగమాటమేదో ములకరిస్తుంటే
ఇదే పొద పదా
శృతి కలిసే జతై ఇలాగే మైమరిచే క్షణాలలో
ఎద సొదలె కధాకళీలై జతులడిగే జ్వరాలలో
చిలక ముద్దులకు అలక పాన్పులకు
జరిగిన రసమయ సమరంలో
చెలీ మనోహరి సఖి మాధురి హృదయా
ప్రియా మహాశయా లయా చూపవేల దయా
మరీ మరీ మనువాడమంటు మనవి చేస్తుంటే
శుభం ప్రియం జయం
అదా ఇదా తొలి రేయి అంటూ అదుముకొస్తుంటే
అదో రకం సుఖం
చెరిసగమై మనం ఇలాగె పెదవడిగే మాజాలలో
రుచిమరిగే మరి ప్రియంగా కొసరడిగే నిషాలలో
ఒకరి హద్దులను ఒకరు వద్దు అను
సరసపు చలి సరిహద్దులలో
ప్రియా మహాశయా లయా చూపవేల దయా
చెలీ మనోహరి సఖి మాధురి హృదయా
స్వయంవరా - ప్రియం కదా
మాటేరాని మౌనం హాయిలో
Vamsanikokadu
Movie More SongsPriya Mahashaya Keyword Tags
-
-