Aa Bugga Meedha
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా..
ఆ చల్లకొచ్చి ముంత దాచుడేందబ్బా
చూడగానె తాపమాయే
ఎండలోన దీపమాయే
రెప్పగొట్తి గిల్లమాక రెచ్చగొట్టి వెళ్లమాక
రేపు దాక ఆగలేనులే
నా బుగ్గమీద గోరుగిచ్చుడేందబ్బా
ఈ పెదవిమీద పంటినొక్కుడేందబ్బా
గుమ్మ ఈడు తాపమాయే
గుండెలోన తాళమాయే
దగ్గిరుంటె దప్పికాయె పక్కనుంటే ఆకలాయె
ఎక్కడింక దాగిపోనురా..
ఎంత సిగ్గు పుట్టుకొచ్చె చెంప తాకితే
చెంప మొగ్గలేసుకొచ్చె చెయ్యి తాకితే
ఏడముట్టుకుంటె ఏమి పుట్టుకొస్తదో
పుట్టుకొచ్చి ఏమి పుట్టి ముంచి పోతదో
అబ్బా ఆగబ్బ అబ్బా ఉండబ్బా
చిన్న ముద్దబ్బ ఇపుడొద్దబ్బా
ఆపుతున్న కొద్ది అగ్గిమంటబ్బా
అంటుకున్నదంటె పెద్ద తంటబ్బా
చెంగుపట్టి లాగగానే చీరకట్టు జారిపోయె
ఉన్న గుట్టు ఊరుదాటెరా...
ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా..
ఈ పెదవిమీద పంటినొక్కుడేందబ్బా
ఈడు వేడి ఎక్కిపోయె ఏడతాకినా
నీరు కాస్త ఆవిరాయె నీడ తాకినా
నిన్నుముట్టుకుంటె గుండె గంటకొట్టెనే
ఒంటిగున్న లోకమంత జంటకట్టెనే
అబ్బా తప్పబ్బా.. తప్పే ఒప్పబ్బా..
ఒప్పుకోనబ్బా ఒక్కసారబ్బా
ఎప్పుడంటె అప్పుడైతే ఎట్టబ్బా
గుట్టుమట్టు చూసుకోవు ఏందబ్బ
చుక్కపూల పక్కమీద జున్నుపాల కొంగులైతే
మల్లెపూలు మాటతప్పునా
నా బుగ్గమీద గోరుగిచ్చుడేందబ్బా
ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా..
గుమ్మ ఈడు తాపమాయే
గుండెలోన తాళమాయే
రెప్పగొట్టి గిల్లమాక రెచ్చగొట్టి వెళ్లమాక
రేపు దాక ఆగలేనులే
నా బుగ్గమీద గోరుగిచ్చుడేందబ్బా
ఆ చల్లకొచ్చి ముంత దాచుడేందబ్బా
Vajrayudam
Movie More SongsAa Bugga Meedha Keyword Tags
-
-