MovieGQ

Chilipi Krishnuni Thoti Chesevu Poti

Vaarasatvam (1964) · Track 4 of 7

Song Details

Lyrics

పల్లవి: చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ ఆ స్వామితో నీవు అన్నింట సాటి .. జో జో... జో జో చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ ఆ స్వామితో నీవు అన్నింట సాటి చరణం: 1 చెరసాలలో పుట్టి వ్రేపల్లెలో వెలసి గొల్ల తల్లుల మనసు కొల్లగొనినాడు ఏ తల్లి ఒడి జారి ఏలాగు చేరావొ ఆపదలె కాపుదలలాయేనె నీకు జో అచ్యుతానంద జోజో ముకుందా... రార పరమానంద రామగోవిందా... జో జో... చరణం: 2 పలు వేసములు పూని పగవారు హింసింప పల్పోకడలు చూపె బాలగోపాలుడూ ఈ ఈడుకే ఎన్ని గండాలు గడిచాయొ ఎంత జాతకుడమ్మ అనిపించినావు జో అచ్యుతానంద జోజో ముకుందా... రార పరమానంద రామగోవిందా... జో జో... చరణం: 3 కాళింది పొగరణచి కంసుణ్ణి పరిమార్చి కన్నవారికి చెరలు తొలగించినాడు వసుదేవ తనయుని వారసత్వము నిలిపి నీవారి వెతలెల్ల నీవె తీర్చేవు చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ ఆ స్వామితో నీవు అన్నింట సాటి చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ ఆ స్వామితో నీవు అన్నింట సాటి జో జో... జో జో జో జో... జో జో జో జో... జో జో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vaarasatvam

See All