MovieGQ

Yeduta Nilichindhi Choodu

Vaana (2008) · Track 7 of 7

Song Details

Singer
Music Director

Lyrics

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మైమరిచిపోయా మాయలో... ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఎదుట నిలిచింది చూడు చరణం: 1 నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి? కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ? ఔనో కాదో అడగకంది నా మౌనం చెలివో శిలవో తెలియకుంది నీ రూపం... చెలిమి బంధం అల్లుకుందే జన్మ ఖైదులా !! ఎదుట నిలిచింది చూడు చరణం: 2 నిన్నే చేరుకోలేకా ఎటెళ్ళిందో నా లేఖ వినేవారు లేకా విసుక్కుంది నా కేకా నీదో కాదో వ్రాసున్న చిరునామా ఉందో లేదో ఆ చోట నా ప్రేమా... వరం లాంటి శాపమేదో సొంతమైందిలా !!! ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మైమరిచిపోయా మాయలో... ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఎదుట నిలిచింది చూడు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vaana

See All