Andhala Ramudu
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పల్లవి:
అందాల రాముడు ఇందీవరశ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేముడు
ఎందువలన దేముడు...
చరణం: 1
తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను (2)
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను
అందాల రాముడు అందువలన దేముడు
చరణం: 2
అనుభవించదగిన వయసు
అడవిపాలు జేసెను (2)
అడుగుపెట్టినంతమేర ఆర్యభూమి జేసెను
అందాల రాముడు అందువలన దేముడు...
చరణం: 3
ధర్మపత్ని చెరబాపగ దనుజుని దునుమాడెను
ధర్మము కాపాడుటకా సతినే విడనాడెను
అందాల రాముడు అందువలన దేముడు...
- పల్లవి:
Uyyala Jampala
Movie More SongsAndhala Ramudu Keyword Tags
-
-
-